ద‌ళిత వాడలో వారం రోజులుగా నో క‌రెంట్.. డిప్యూటీ సీఎం గారూ జ‌ర చూడండి : కేటీఆర్

రాష్ట్రంలో విద్యుత్ కోత‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రోజుల త‌ర‌బ‌డి క‌రెంట్ ఉండ‌డం లేదు. తెలంగాణ‌లో క‌రెంట్ కోత‌ల్లేవ‌ని, అన్ని రంగాల‌కు 24 గంట‌ల క‌రెంట్ అందిస్తున్నామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అయితే క‌రెంట్ కోత‌ల‌పై ప్ర‌భుత్వం అబ‌ద్దాలాడుతోంది అన‌డానికి ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం.

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలోని అయిజ మండ‌లం పులిక‌ల్ గ్రామంలోని ద‌ళిత వాడ‌లో గ‌త వారం రోజులుగా క‌రెంట్ లేదు. ద‌ళిత కుటుంబాల‌న్నీ చీక‌ట్లోనే ఉంటున్నాయి. గ్రామంలోని ఇతర బీసీ కాల‌నీల్లో క‌రెంట్ ఉన్న‌ప్ప‌టికీ, ద‌ళిత వాడ‌లో మాత్రం క‌రెంట్ లేదు.

ఈ విష‌యంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ద‌ళిత వాడ‌లో వారం రోజులుగా క‌రెంట్ లేదు.. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క జ‌ర చూడండి అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ద‌ళిత వాడ ప్ర‌జ‌లు గ్రామ స‌ర్పంచ్‌తో పాటు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నారు. మాదిగ‌లంటే ప్ర‌భుత్వానికి ఇంత చిన్న‌చూపా..? అని నిల‌దీస్తున్నారు. బీసీ కాల‌నీల్లో క‌రెంట్ ఉంది. స‌ర్పంచ్ కూడా మా కాల‌నీకి రావ‌డం లేదు. ఇప్ప‌టికే అధికారుల‌ను అడిగాం.. కానీ ప‌ట్టించుకోవ‌డం లేదు.. క‌రెంట్ లేక‌పోవ‌డంతో కాల‌నీలోకి పాములు వ‌చ్చినా క‌నిపించ‌డం లేద‌ని, ఇప్పుడే ఒక పామును చంపామ‌ని ద‌ళితులు వాపోయారు.

Leave a Comment